Rashi phalalu | rasi phalam | today rasi phalalu | today horoscope in telugu | today astrology in telugu

Play all audios:

Ee Font size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA LARGE ఈరోజు (08-06-2025) మీకు మధ్యమ ఫలితాలున్నాయి. తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ధన వ్యయం సూచితం.
నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదవడం మంచిది. చిత్త నక్షత్రం (3, 4 పాదాలు) వారికి మధ్యాహ్నం 12:42 వరకు సంపత్తార, ఆ తర్వాత విపత్తార ఉంది. స్వాతి నక్షత్రం వారికి మధ్యాహ్నం 12:42 వరకు జన్మ తార, ఆ తర్వాత
సంపత్తార ఉంది. విశాఖ నక్షత్రం (1, 2, 3 పాదాలు) వారికి మధ్యాహ్నం 12:42 వరకు పరమ మిత్ర తార, ఆ తర్వాత జన్మ తార ఉంది. ఈవారం (08-06-2025 - 14-06-2025) ఇది మీకు చక్కని శుభకాలం. స్వల్ప ప్రయత్నంతోనే
విశేషమైన లాభం ఉంటుంది. దైవబలం మీకు తోడుగా ఉంటుంది, కృషి విజయవంతమవుతుంది. పనుల్లో సాధికారతను సాధిస్తారు, మీ నిర్ణయాలు శుభఫలితాలను ఇస్తాయి. మేలైన భవిష్యత్తు లభిస్తుంది. కేవలం ఆలోచనలకే పరిమితం
కాకుండా, ఆశయాలకు తగ్గట్టుగా ప్రయత్నం కొనసాగించాలి. మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో పని చేయడం ద్వారా కష్టాలను సునాయాసంగా అధిగమించవచ్చు. ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది. ఎవరి
మాటలు మనసుకు తీసుకోకుండా.. పనిపై లక్ష్యం ఉంచాలి. వ్యాపారంలో శ్రద్ధ పెంచండి. కొత్త ప్రయత్నాలు చేయవద్దు. ఉన్నదాన్ని జాగ్రత్తగా అభివృద్ధిపరచండి. భూ లాభం సూచితం. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు
పాటించాలి. అనవసరపు మాటలతో నష్టం రాకుండా చూడాలి. ఆత్మీయుల సహకారం ఆనందాన్నిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలుంటాయి. ప్రశాంత జీవనాన్ని కొనసాగించండి. లక్ష్మీ ధ్యానం శుభప్రదం.