Mani ratnam: నవీన్ పొలిశెట్టితో సినిమా? : స్పందించిన మణిరత్నం

Play all audios:

ఇంటర్నెట్ డెస్క్: టాలీవుడ్ నటుడు నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) హీరోగా మణిరత్నం ఓ సినిమా చేసే అవకాశాలున్నాయంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా
ఎంపికైందంటూ ఊహాగానాలొచ్చాయి. ఓ ఇంటర్వ్యూలో వాటిపై మణిరత్నం స్పందించారు. తనకూ అవి వార్తలేనని పేర్కొన్నారు. ప్రస్తుతం కొన్ని స్క్రిప్ట్‌లపై వర్క్ చేస్తున్నానని, ఏది ముందుగా తెరపైకి వస్తుందో
తెలియదన్నారు. * పవన్ కల్యాణ్ పెద్దన్నలాంటివారు.. తిడితే పడతాం: దిల్ రాజు హీరో- హీరోయిన్ల ఏజ్ గ్యాప్ చర్చపై ఇలా.! కమల్‌హాసన్, త్రిష, అభిరామి, శింబు ప్రధాన పాత్రల్లో దర్శకుడు మణిరత్నం
తెరకెక్కిస్తున్న సినిమా ‘థగ్ లైఫ్’ (Thug Life). అందులో ఓ వైపు త్రిషతో, మరోవైపు అభిరామితో కమల్‌హాసన్ రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. హీరోకి, హీరోయిన్లకు మధ్య వయసులో చాలా వ్యత్యాసం ఉందంటూ
నెట్టింట చర్చ మొదలైంది. దీనిపై మణిరత్నం స్పందించారు. సినిమాకి సంబంధించి అందులోని పాత్రలను చూడాలిగానీ కమల్‌హాసన్, త్రిషలను చూడకూడదన్నారు.