Gaddar film awards: ఈ అవార్డు మా బాధ్యతను పెంచింది.. తెలంగాణ ప్రభుత్వానికి నిర్మాణ సంస్థల కృతజ్ఞతలు

Gaddar film awards: ఈ అవార్డు మా బాధ్యతను పెంచింది.. తెలంగాణ ప్రభుత్వానికి నిర్మాణ సంస్థల కృతజ్ఞతలు

Play all audios:


ఇంటర్నెట్‌ డెస్క్: తెలంగాణ ప్రభుత్వానికి టాలీవుడ్‌ నిర్మాణసంస్థలు కృతజ్ఞతలు తెలిపాయి. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం గద్దర్‌ అవార్డును ప్రకటించిన (Gaddar Film Awards) విషయం తెలిసిందే. ఇందులో పలు


సినిమాలు అవార్డులను సొంతం చేసుకున్నాయి. ఈనేపథ్యంలో ఎక్స్‌ వేదికగా నిర్మాణసంస్థలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్‌లు పెట్టాయి. సీఎం రేవంత్‌రెడ్డికి దర్శక, నిర్మాతలు ప్రత్యేక కృతజ్ఞతలు


తెలిపారు. గద్దర్‌ అవార్డుల్లో ‘లక్కీ భాస్కర్‌’ హవా.. నేడు ప్రకటించిన గద్దర్‌ అవార్డుల్లో లక్కీ భాస్కర్‌ (Lucky Bhaskar) సినిమా హవా చూపింది. ఏకంగా నాలుగు అవార్డులను (ఉత్తమ చిత్రం, ఉత్తమ


నటుడు, ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ ఎడిటర్‌) సొంతం చేసుకుంది. ఇది టీమ్‌కు ఎంతో గర్వకారణమని నిర్మాణసంస్థ పేర్కొంది. ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పింది. అలాగే తెలంగాణ


ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.  * ‘గద్దర్‌’ అవార్డులు: ఉత్తమ చిత్రం కల్కి.. ఉత్తమ నటుడు అల్లు అర్జున్‌ ఉత్తమ చిత్రంగా ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) అవార్డును సొంతం


చేసుకుంది. దీనిపై నిర్మాణసంస్థ వైజయంతీ మూవీస్‌ పోస్ట్‌ పెట్టింది. చిత్ర బృందాన్ని ప్రోత్సహించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. ఉత్తమ పరిచయ దర్శకుడిగా ‘కమిటీ కుర్రాళ్లు’కు


గాను యధువంశీ అవార్డును సొంతం చేసుకున్నారు. వంశీకి అవార్డు ఇచ్చినందుకు ప్రభుత్వానికి థ్యాంక్స్‌ చెబుతూ నిర్మాణ సంస్థ పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్‌ పోస్ట్‌ పెట్టింది. ‘‘కమిటీ కుర్రాళ్లు టీమ్‌కు


ఇదో ఒక మైలురాయి. తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి, సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మా కృతజ్ఞతలు. మా శ్రమను గుర్తించిన   గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల జ్యూరీ సభ్యులకు


ధన్యవాదాలు. ఈ గుర్తింపు మా గౌరవాన్ని మరింత పెంచింది’’ అని పేర్కొంది.  ఇక ‘ఆయ్‌’ సినిమా ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలిచింది. దీంతో చిత్రబృందం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. ఈ


క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేమని పేర్కొంది.