The paradise: క్రేజీ కాంబో.. నాని సినిమాలో ‘కిల్’ విలన్

Play all audios:

హైదరాబాద్: నాని (Nani) కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’ (The Paradise). టైటిల్ టీజర్‌తోనే సినిమాపై అంచనాలను పెంచారు. ఇప్పటికే ఈ
మూవీకి సంబంధించి ఒక షెడ్యూల్ పూర్తయింది. ఈ నేపథ్యంలో ‘ప్యారడైజ్’లో నటించే ఇతర నటీనటుల ఎంపిక కొనసాగుతోంది. ఇందులో బలమైన ప్రతినాయకుడి పాత్రకు రాఘవ్ జుయెల్‌ను చిత్ర బృందం ఎంపిక చేసిందట.
బాలీవుడ్ యాక్షన్ మూవీ ‘కిల్’లో తనదైన నటనతో మెప్పించాడు రాఘవ్. హావభావాలు, ఆహార్యంతోనే నటించి మెప్పించాడు. శ్రీకాంత్ ఓదెలకు ఆ టైమింగ్ నచ్చడంతో ఇప్పుడు ‘ప్యారడైజ్’ కోసం తీసుకున్నట్లు
తెలుస్తోంది. దీంతో నానికి దీటుగా నటించే నటుడు దొరికాడంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హై ఎనర్జీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో పాత్రల నేపథ్యం బలంగా ఉంటుందని టీమ్
చెబుతోంది. దీంతో దర్శకుడు శ్రీకాంత్ అందుకు తగిన నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. రాఘవ్ లుక్‌కు సంబంధించిన పోస్టర్‌ను కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన పూర్తి
వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. మరోవైపు ఇందులో కథానాయికగా ఇప్పటికే కీర్తి సురేశ్‌ను చిత్ర బృందం తీసుకుంది. ఇక నాని తల్లి పాత్ర కోసం కూడా ఎంపిక జరుగుతోంది. ఇప్పటికే పలువురు సీనియర్
నటీమణులను సంప్రదించినట్లు సమాచారం. త్వరలోనే ఈ పాత్రకు సంబంధించిన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరాఠీ నటి సోనాలి కులకర్ణిని దాదాపు ఖాయం చేసినట్లు సమాచారం. దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక
ప్రకటన వెలువడాల్సి ఉంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న సినిమా కావడంతో అందుకు తగినట్లే చిత్ర బృందం కూడా నటీనటులను ఎంపిక చేస్తోంది.