Sandeep reddy vanga: కథను లీక్ చేయడమే మీ ఫెమినిజమా..? : హాట్ టాపిక్‌గా మారిన సందీప్ వంగా పోస్ట్

Play all audios:

ఇంటర్నెట్ డెస్క్: ఎలాంటి విషయంలోనైనా తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెబుతారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. తాజాగా ఆయన తన సినిమాకు సంబంధించి పెట్టిన ఓ పోస్ట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా
మారింది. ఓ అగ్ర కథానాయికకు చెందిన పీఆర్ టీమ్ తన స్టోరీని లీక్ చేసే ప్రయత్నం చేస్తోందంటూ ఆయన (Sandeep Reddy Vanga) ఆరోపించారు. ‘డర్టీపీఆర్ గేమ్స్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఎక్స్ వేదికగా ఓ
పోస్ట్ పెట్టారు. ‘‘ఇటీవల నేను ఓ అగ్ర కథానాయికకు స్టోరీ చెప్పాను. వందశాతం నమ్మకంతో ఆమెకు వివరించాను. దర్శకులు నటీనటులకు కథ నెరేట్ చేశారంటే వారి మధ్య అనధికారిక నాన్ డిస్‌క్లోజర్ అగ్రిమెంట్
ఉన్నట్లే లెక్క. దీని ప్రకారం స్టోరీని ఎవరికీ చెప్పకూడదు. కానీ, ఆమె ఈ ఒప్పందాన్ని బ్రేక్ చేసి లీక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక యువ కథానాయికను ఎదగకుండా చేయడం.. ఎంతో కష్టపడి రాసుకున్న నా
కథను లీక్ చేయడం.. ఇదేనా మీ దృష్టిలో ఫెమినిజం అంటే? దర్శకుడిగా నేను కథ రాయడం కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడతాను. నాకు సినిమానే ప్రపంచం. ఎప్పటికీ దీన్ని మీరు అర్థంచేసుకోలేరు. కావాలంటే నా
స్టోరీని మొత్తం లీక్ చేయండి. నేనేం భయపడను’’ అని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. * పవన్ చిత్రాల్ని ఆపే దమ్ము.. ధైర్యం ఎవరికీ లేవు: దిల్‌రాజు ప్రస్తుతం సందీప్ పోస్ట్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా
మారింది. ‘యానిమల్’ తర్వాత ఈయన ప్రభాస్ నటిస్తోన్న ‘స్పిరిట్’ (Spirit) దర్శకత్వ పనుల్లో బిజీగా ఉన్నారు. భారీ స్థాయిలో రానున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ను తీసుకోనున్నట్లు గతంలో
వార్తలు వచ్చాయి. తర్వాత ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలగినట్లు కూడా కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ సరసన యంగ్ హీరోయిన్ త్రిప్తి డిమ్రీ (Tripti Dimri) నటించనున్నట్లు ఇటీవల టీమ్
అధికారికంగా ప్రకటించింది. సందీప్ తన పోస్ట్‌లో పెట్టిన యువకథానాయిక త్రిప్తి అని.. ఆమెను తీసుకోవడంపై కొందరు అసహనం వ్యక్తంచేస్తూ తన స్టోరీని లీక్ చేసి ఉంటారని నెటిజన్‌లు పోస్ట్‌లు
పెడుతున్నారు. దీంతో ‘స్పిరిట్’ హ్యాష్ ట్యాగ్ ఎక్స్‌లో ట్రెండ్ అవుతోంది.