Google: యూజర్ల సీక్రెట్ డేటాపై గూగుల్ కీలక ప్రకటన.. ఇది నిజంగా గుడ్ న్యూస్..

Play all audios:

గూగుల్ ఇన్‌కాగ్నిటో మోడ్‌లో కూడా కొంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తుంది. ఈ విషయం కొంత కాలం క్రితం బయటపడింది. దీంతో క్రోమ్‌లో సీక్రెట్‌గా బ్రౌజింగ్ చేస్తున్నామని భావించే యూజర్లు షాక్ అయ్యారు.
దీనిపై కోర్టులో ఒక కేసు నడిచింది. తాజాగా ఈ కేసులో గూగుల్ ఒక సెటిల్‌మెంట్ చేసుకుంది. * డిలీట్ చేసేందుకు రెడీ ఈ సెటిల్‌మెంట్ ప్రకారం, గూగుల్ గతంలో ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్ లేదా ఇన్‌కాగ్నిటో
మోడ్‌లో సేకరించిన బిలియన్ల కొద్దీ డేటా రికార్డులను నాశనం చేస్తుంది. భవిష్యత్తులో ఇన్‌కాగ్నిటో మోడ్‌లో సేకరించే సమాచారం చాలా తక్కువగా ఉండేలా చూసుకుంటుంది. ఇన్‌కాగ్నిటో మోడ్ ఎలా పనిచేస్తుందో
యూజర్లకు మరింత స్పష్టంగా తెలియజేస్తుంది. advertisement ఈ ఒప్పందం సోమవారం కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో దాఖలైంది. ఇది అమలులోకి రావాలంటే, US డిస్ట్రిక్ట్ జడ్జి యవోన్నే గోంజాలెజ్ రాజర్స్ ఆమోదం
అవసరం. ఈ ఒప్పందం విలువ 5 బిలియన్ డాలర్ల నుంచి 7.8 బిలియన్ డాలర్ల వరకు ఉండవచ్చని బాధితుల తరపు న్యాయవాదులు అంచనా వేశారు. * డేటా కలెక్షన్‌పై ఆందోళనలు తాజా ఒప్పందంతో గూగుల్ నుంచి యూజర్లు
నష్టపరిహారం పొందే అవకాశం లేదు. అయితే, వ్యక్తిగతంగా నష్టపరిహారం కోసం వారు గూగుల్‌పై దావా వేయవచ్చు. ఈ కలెక్టివ్ ఫైలింగ్ 2020లో ప్రారంభమైంది. 2016, జూన్ 1 నుంచి ప్రైవేట్ బ్రౌజింగ్ ఉపయోగించిన
లక్షలాది మంది గూగుల్ వినియోగదారులు దీనిలో భాగం. advertisement గూగుల్ అనలిటిక్స్, కుకీలు, యాప్స్ వంటి టూల్స్ ద్వారా "ఇన్‌కాగ్నిటో" మోడ్‌లో కూడా యూజర్లను ట్రాక్ చేయగలదని కొందరు
చెబుతున్నారు. ఇది చాలా మందికి ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే గూగుల్ యూజర్ స్నేహితులు, ఇష్టమైన ఆహారాలు, అభిరుచులు, షాపింగ్ అలవాట్ల వంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని పొందగలదు. advertisement
ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసే కొన్ని విషయాలు, ఇతరులకు తెలియకూడదనుకునేవి కూడా గూగుల్ తెలుసుకోవచ్చు. అయితే గూగుల్ ఇలాంటి భయాలేవీ పెట్టుకోవద్దని యూజర్లకు చెబుతోంది. "ఇన్‌కాగ్నిటో" మోడ్‌లో
బ్రౌజింగ్ హిస్టరీని సేవ్ చేయమని, కానీ యూజర్ సందర్శించే వెబ్‌సైట్లు వారి గురించి డేటాను సేకరించగలవని వివరించింది. ప్రైవేట్ బ్రౌజింగ్ సమయంలో కలెక్ట్ చేసి డేటా గురించి మార్పులు చేయడానికి
గూగుల్ ఒప్పుకుంది. గూగుల్ ఇప్పటికే ఈ విషయం గురించి యూజర్లకు అప్‌డేట్ చేయడం ప్రారంభించింది. అలానే ఇన్‌కాగ్నిటో మోడ్ యూజర్లు ఐదేళ్ల పాటు థర్డ్ పార్టీ కుకీలను బ్లాక్ చేసుకోవచ్చు. ఫలితంగా,
గూగుల్ యూజర్ల ప్రైవేట్ బ్రౌజింగ్ యాక్టివిటీస్ నుంచి తక్కువ డేటాను సేకరిస్తుందని బాధితుల తరపు న్యాయవాదులు చెబుతున్నారు. advertisement కోర్టు డాక్యుమెంట్స్ ప్రకారం, గూగుల్ ఈ ఒప్పందం ఆమోదం
పొందాలని కోరుకుంటుంది. బాధితుల తరపు న్యాయవాది డేవిడ్ బోయెస్, మాట్లాడుతూ ఇలాంటి సెటిల్‌మెంట్ల ద్వారా పెద్ద టెక్నాలజీ కంపెనీలను బాధ్యతాయుతంగా ఉండేలా చేయవచ్చని అన్నారు. ఈ కేసుకు సంబంధించి ఒక
తాత్కాలిక ఒప్పందం డిసెంబర్‌లో జరిగింది. 2024 ఫిబ్రవరి 5న ట్రయల్ షెడ్యూల్ వేశారు. ఈ కేసు పేరు "బ్రౌన్ et al v గూగుల్ LLC et al". ఈ కేసు U.S. డిస్ట్రిక్ట్ కోర్టు ఫర్ ది నార్తెన్
డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియాలో నమోదు చేశారు. కేసు నంబర్ 20-03664. Location : Hyderabad,Telangana First Published : April 04, 2024 7:41 AM IST