Ruchi gujjar: కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌: మోదీ ఫొటో నెక్లెస్‌తో రుచి.. టీ షర్ట్‌తో జాన్వీ

Ruchi gujjar: కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌: మోదీ ఫొటో నెక్లెస్‌తో రుచి.. టీ షర్ట్‌తో జాన్వీ

Play all audios:


మోదీ ఫొటో నెక్లెస్‌ ధరించిన రుచి గుజ్జర్‌ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారారు. కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఆమె సందడి చేశారు. ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫ్యాషన్‌కు కేరాఫ్‌గా నిలుస్తుంటుంది ‘కేన్స్‌


ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ (Cannes Film Festival). ఈ నెల 13న ప్రారంభమైన ఆ సినీ వేడుక 24న ముగియనుంది. రెడ్‌కార్పెట్‌పై ఇప్పటికే పలువురు తారలు విభిన్న వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. అలనాటి నటీమణుల


మినియేచర్‌ ఫొటోలతో కూడిన ముత్యాల దండను జడకు సింగారించుకుని బాలీవుడ్‌ నటి నితాన్షీ అందరి చూపు తనవైపునకు తిప్పుకొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో నటి రుచి గుజ్జర్‌ (Ruchi Gujjar).. ప్రధాని


నరేంద్ర మోదీ ఫొటోతో కూడిన నెక్లెస్‌ ధరించి అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేశారు. సంబంధిత ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని మోదీపై


గౌరవంతో కేన్స్‌లో ఆ నెక్లెస్‌ ధరించానని రుచి మీడియాకు చెప్పారు. దేశాన్ని ఉన్నత శిఖరాల వైపు నడిపిస్తున్నారని మోదీని కొనియాడారు. మిస్‌ హరియాణా 2023 విజేత అయిన రుచి పలు మ్యూజిక్‌ వీడియోల్లో,


పలు హిందీ సినిమాల్లో నటించారు. * కేన్స్‌లో జడతో ఫేమస్‌.. ఎవరీ నీతాన్షీ గోయెల్‌ జాన్వీ కపూర్‌ సినిమా స్క్రీనింగ్‌.. ఇషాన్‌ ఖట్టర్‌, జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) జంటగా నీరజ్‌ ఘైవాన్‌


తెరకెక్కించిన ‘హోమ్‌ బౌండ్‌’ (Home Bound) సినిమాని ఆ వేడుకలో బుధవారం ప్రదర్శించనున్నారు. చిత్ర బృందం ఇప్పటికే అక్కడకు చేరుకుంది. సినిమా టైటిల్‌ లోగో ఉన్న టీ షర్ట్‌ ధరించిన జాన్వీ కపూర్‌


సంబంధిత ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. మరోవైపు, తన కుమార్తెతో కలిసి ఐశ్వర్యారాయ్‌ మంగళవారం అక్కడకు వెళ్లారు. ప్రతి ఏడాది జరిగే కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ఐశ్వర్య వెళుతుంటారనే సంగతి


తెలిసిందే.