Shubman gill: టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు గిల్‌కు అప్పగిస్తే.. గుజరాత్‌ కోచ్‌ స్పందనిదే

Shubman gill: టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు గిల్‌కు అప్పగిస్తే.. గుజరాత్‌ కోచ్‌ స్పందనిదే

Play all audios:


ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్సీ బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారనే చర్చ నడుస్తోంది. ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్సీ విషయంపై చర్చ


కొనసాగుతోంది. రోహిత్‌ శర్మ సుదీర్ఘ ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన నేపథ్యంలో.. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను ఎవరు ముందుండి నడిపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. టెస్టు కెప్టెన్సీ


రేసులో శుభ్‌మన్‌ గిల్‌ (Shubman Gill), బుమ్రా (Jasprit Bumrah) పేర్లు వినిపిస్తున్నాయి. అయితే.. బుమ్రా తరచూ గాయాలబారిన పడుతుండటంతో.. గిల్‌ ఈ రేసులో కాస్త ముందున్నాడు. మరోవైపు ఈ ఐపీఎల్‌


సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ (Gujarat Titans) ను అతడు అద్భుతంగా నడిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గిల్‌కు టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తే ఎలా రాణిస్తాడనే ప్రశ్నకు గుజరాత్‌ అసిస్టెంట్‌ కోచ్‌


ఆశిష్‌ కపూర్‌ స్పందించాడు. ‘‘గిల్‌ను నేను అండర్‌-16 రోజుల నుంచి చూస్తున్నాను. అతడు అందరికంటే ఎక్కువ ఆలోచిస్తాడు. తన గురించే కాకుండా.. పది మంది ఆటగాళ్ల గురించి కూడా ఆలోచిస్తాడు. మ్యాచ్‌లు ఎలా


గెలవాలో ప్రణాళికలు వేస్తాడు’’ అని తెలిపాడు. * దెబ్బకు మూడు బెర్తులు.. ప్లేఆఫ్స్‌లో గుజరాత్, బెంగళూరు, పంజాబ్‌ పరిమిత అనుభవం ఆధారంగా కెప్టెన్సీ సామర్థ్యాలను అంచనా వేయడం కష్టమని కపూర్‌


పేర్కొన్నాడు. ‘‘2007లో ధోనీకి ప్రపంచకప్‌ బాధ్యతలు అప్పగించినప్పుడు.. అతడికి గతంలో కెప్టెన్సీ చేసిన అనుభవం కూడా లేదు. కానీ.. అతడు ప్రపంచంలోనే అత్యుత్తమ సారథిగా ఎదుగుతాడని అప్పట్లో ఎవరూ ఊహించి


ఉండరు. దీంతో ఏ ఆటగాడిపైనైనా జడ్జిమెంట్‌ ఇచ్చే ముందు.. అతడిని కొంతకాలం పాటు గమనించాలి. శుభ్‌మన్‌ విషయంలో ఇప్పుడే చెప్పడం కష్టం’’ అని పేర్కొన్నాడు.