Supreme court: రాజ్ కెసిరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

Play all audios:

దిల్లీ: ఏపీ మద్యం కుంభకోణం కేసులో రాజ్ కెసిరెడ్డికి సుప్రీంకోర్టులో (Supreme Court) చుక్కెదురైంది. కెసిరెడ్డి ఉపేంద్రరెడ్డి, రాజ్ కెసిరెడ్డి పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
ఇప్పటికే కస్టడీలో ఉన్నందున బెయిల్ కోసం సంబంధిత కోర్టును ఆశ్రయించాలని సూచించింది. తన కుమారుడి అరెస్టు సమయంలో నిబంధనలు పాటించలేదని ఉపేంద్రరెడ్డి పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. మరోవైపు తన
అరెస్టు అక్రమమని రాజ్ కెసిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. పక్క రాష్ట్రంలో ఉంటే అరెస్టు చేసే అధికారం ఏపీ సీఐడీకి లేదని అందులో పేర్కొన్నారు. రెండు పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ పార్థివాలా
ధర్మాసనం.. ఈ నెల 19న తీర్పును రిజర్వ్ చేసింది. వాటిని కొట్టివేస్తున్నట్లు తాజాగా శుక్రవారం తీర్పు వెలువరించింది. (Andhra Prasdesh News)