Tamannaah: దీపికాకు సపోర్ట్‌ చేస్తున్న తమన్నా.. అసలు విషయమిదే

Tamannaah: దీపికాకు సపోర్ట్‌ చేస్తున్న తమన్నా.. అసలు విషయమిదే

Play all audios:


ఇంటర్నెట్‌డెస్క్‌: కొన్ని రోజులుగా బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె (Deepika Padukone) పేరు సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ పోస్ట్‌కు ఇన్‌స్టాలో తమన్నా


లైక్‌ చేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. దీపికాకు ఆమె సపోర్ట్‌ చేస్తున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. దీనిపై మిల్కీబ్యూటీ స్పందించారు. తన ఇన్‌స్టా స్టోరీలో వివరణ ఇచ్చారు. ‘‘తనకు తానుగా


పోస్ట్‌లను ఇన్‌స్టాగ్రామ్‌ ఎలా లైక్‌ చేస్తుందో చెబితే బాగుంటుంది. ఎందుకంటే ఈ విషయం తెలియని కొందరు దీన్ని పెద్ద వార్తలాగా ప్రచారం చేశారు. నేను పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి’’ అని


క్యాప్షన్‌ పెట్టారు. దీంతో ఆ పోస్ట్‌ను తమన్నా (Tamannaah) కావాలని లైక్‌ చేయలేదని స్పష్టమవుతోంది. * ఎప్పుడూ మనసు చెప్పేదే వింటాను: దీపికా పదుకొణె అసలేం జరిగిందంటే.. దీపికాకు చెందిన పాత


వీడియోని తాజాగా ఓ అభిమాని షేర్‌ చేశారు. అందులో ఆమె ఓవర్‌ టైమ్‌ పనిచేయడం, ప్రపంచంలో ఉన్న లింగ అసమానతలతో పాటు మరికొన్ని విషయాల గురించి మాట్లాడారు. ఈ పోస్ట్‌కు తమన్నా లైక్‌ కొట్టినట్లు ఆ


అభిమాని ఓ స్క్రీన్‌ షాట్‌ను షేర్‌ చేశారు. దీంతో ఆమెకు తమన్నా సపోర్ట్‌ చేస్తున్నారంటూ కథనాలు వచ్చాయి. తన సినిమాను లీక్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఒక స్టార్‌ డైరెక్టర్‌ చేసిన కామెంట్స్‌


దీపికాను ఉద్దేశించే అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తమన్నా ఆమెకు సంబంధించిన పోస్ట్‌ను లైక్‌ చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది.