Balagam: ‘బలగం’ నటుడి కన్నుమూత

Play all audios:

ఇంటర్నెట్‌డెస్క్: ‘బలగం’ సినిమాలో చిన్న తాత పాత్ర పోషించిన నటుడు జీవీ బాబు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న ఆయన వరంగల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. విషయం
తెలిసి చిత్ర దర్శకుడు వేణు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. జీవీ బాబు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ‘‘జీవీ బాబు గారు ఇకలేరు. ఆయన జీవితం మొత్తం నాటక రంగంలోనే గడిపారు. చివరి రోజుల్లో
ఆయన్ని ‘బలగం’తో వెండితెరకు పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు.