Ola electric: ఓలాకు మరో ఎదురుదెబ్బ.. మార్కెట్‌ వాటాలో మూడో స్థానానికి

Ola electric: ఓలాకు మరో ఎదురుదెబ్బ.. మార్కెట్‌ వాటాలో మూడో స్థానానికి

Play all audios:


Ola Electric | ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ విద్యుత్‌ ద్విచక్ర వాహన మార్కెట్‌లో ఒకప్పుడు టాప్‌లో ఉన్న ఓలా ఎలక్ట్రిక్‌ (Ola Electric) క్రమంగా తన స్థానాన్ని కోల్పోతూ వస్తోంది. ప్రత్యర్థి కంపెనీలైన


టీవీఎస్‌ మోటార్‌, బజాజ్‌ ఆటో విక్రయాలు జోరందుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. మేలో మూడో స్థానానికి పడిపోయింది. దీంతో ఇప్పటికే నియంత్రణ సంస్థల నుంచి సమస్యలు ఎదుర్కొంటున్న ఈ సంస్థకు మరో


ఎదురుదెబ్బ తగిలినట్లైంది.  ప్రభుత్వ వాహన్‌ పోర్టల్‌ డేటా ప్రకారం.. మే 1- 26 మధ్య 15,221 ఓలా ఎలక్ట్రిక్‌ వాహన రిజిస్ట్రేషన్లు జరిగాయి. గతేడాది మేలో నమోదైన 37,388 యూనిట్లతో పోలిస్తే సుమారు 60


శాతం తక్కువ. ఈ ఏడాది ఏప్రిల్‌లో 22.1 శాతంగా ఉన్న మార్కెట్‌ వాటా మే నాటికి 20 శాతానికి పడిపోయింది. గతేడాది ఇదే సీజన్‌లో ఈవీ ద్విచక్ర వాహన విభాగంలో 50 శాతం వాటాతో అగ్రగామిగా నిలిచింది. 2025 మే


నాటికి టీవీఎస్‌ మోటార్‌ 25 శాతంతో తొలి స్థానంలో నిలవగా.. బజాజ్ ఆటో 22.6 శాతంతో రెండో స్థానంలో ఉంది. ఇక ఏథర్‌ ఎనర్జీ వాటా 13.1 శాతంతో నాలుగో స్థానానికి పరిమితమైంది. నేటి మధ్యాహ్నం 12:17 గంటల


సమయంలో కంపెనీ షేర్లు 0.95 శాతం లాభంతో రూ.53 వద్ద ట్రేడవుతున్నాయి. * టెక్‌ కంపెనీల్లో 50% తగ్గిన ప్రెషర్ల నియామకాలు ఈ ఏడాది ఫిబ్రవరికి గాను వాహన్‌ పోర్టల్‌లో ఓలా ఎలక్ట్రిక్‌ రిజిస్ట్రేషన్ల


సంఖ్య 8,652గా ఉంది. కంపెనీ మాత్రం 25వేల యూనిట్లు విక్రయించినట్లు ప్రకటించింది. మార్చి 20 నాటికి పోర్టల్‌లో ఈ సంఖ్య 11,781గా నమోదైంది. దీంతో ఆటోమోటివ్‌ రీసెర్చి అసోసియేషన్‌ ఈ వాహన విక్రయ


సంస్థ డేటాపై విచారణ చేపట్టింది. ఇప్పటికే వాహన నాణ్యత, సర్వీసుల్లో లోపాలపై సీసీపీఏ దర్యాప్తును ఎదుర్కొంటోంది. ఓలా ఎలక్ట్రిక్‌ యాజమాన్యంలోని అనుబంధ సంస్థ ఓలా సెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్


2023 మేలో గిగాఫ్యాక్టరీ నిర్మాణాన్ని ప్రారంభించినప్పటికీ.. దాని పురోగతిపై అనిశ్చితి నెలకొంది. ఇలా అనేక సమస్యలు చుట్టుముట్టడంతో ఓలా టూ వీలర్‌ మార్కెట్‌లో తన వాటాను క్రమంగా కోల్పోతోంది.