Kamal haasan: ఆ విషయంలో దురదృష్టవంతుడిని: కమల్ హాసన్

Play all audios:

ఇంటర్నెట్‌డెస్క్: ‘థగ్ లైఫ్’ అంటూ ప్రేక్షకులను పలరించేందుకు సిద్ధమయ్యారు అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan). మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా (Thug Life) జూన్ 5న
ప్రేక్షకుల ముందుకురానుంది. ఈసందర్భంగా ప్రచారంలో పాల్గొన్న కమల్ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మలయాళ ఇండస్ట్రీపై తనకున్న అభిమానాన్ని వివరించారు. పరిశ్రమలోని దిగ్గజ దర్శక నిర్మాతలతో
వర్క్ చేయలేకపోయినందుకు బాధపడ్డారు. మలయాళ పరిశ్రమలో అవకాశాల గురించి మాట్లాడుతూ.. ‘‘నా కంపెనీని నడపడానికి నేను ఇప్పటికీ సంపాదన వెంట పరుగెడుతున్నాను. నిజానికి నా దగ్గర ఉన్న డబ్బు కంటే ఎక్కువ
అవసరం లేదు. కానీ, నా సినిమాలు తీయడానికి మరింత డబ్బు అవసరం. అందుకే ఆర్థికంగా బలపడడం కోసం మాలీవుడ్ ఇండస్ట్రీని ఎంచుకున్నాను. నేను ఒక విషయంలో దురదృష్టవంతుడిని. ఈ రంగంలోకి ప్రవేశించినప్పటికీ
ఎం.టీ వాసుదేవన్ నాయర్, మృణాల్ సేన్ వంటి దిగ్గజాలతో నేను సినిమాలు చేయలేకపోయాను’’ అని చెప్పారు. * నేను ద్రోణాచార్యుడిని కాదు.. విద్యార్థినే: కమల్‌హాసన్ సినిమా ఫలితాల గురించి మాట్లాడుతూ..
‘‘నేను మూడేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి నటించడం మొదలుపెట్టాను. ప్రతిరోజూ మంచి రోజుగానే భావిస్తాను. అందుకే సినిమా విడుదల రోజు ఆందోళన చెందను. ఈ పరిణితి అనుభవాన్ని బట్టి వస్తుంది. ప్రతి సినిమా
విజయం సాధించాలని కోరుకుంటాం. భారీ బడ్జెట్‌తో దాన్ని నిర్మిస్తాం. ఒక్కోసారి అనుకున్న ఫలితం రాదు. అప్పుడు కొన్నిసార్లు ఆడియన్స్‌ను నిందిస్తాం. మరికొన్నిసార్లు మనల్ని మనమే నిందించుకుంటాం.
దీన్ని అంగీకరించడానికి కొంత సమయం పడుతుంది. వయసు, అనుభవం మనకు ఎన్నో విషయాలు నేర్పుతాయి’’ అని వివరించారు. ‘నాయకన్’ (1987) లాంటి హిట్ తర్వాత కమల్ - మణిరత్నం (Mani Ratnam) కాంబినేషన్లో
వస్తోన్న చిత్రమిది. గ్యాంగ్‌స్టర్, యాక్షన్ డ్రామా ఫిల్మ్‌గా ఇది సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. కమల్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార
చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా నాయకన్ కంటే బాగుంటుందని కమల్ హాసన్ పలు ఇంటర్వ్యూల్లో ధీమా వ్యక్తంచేశారు.